Asian Wrestling: రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కు తొలి స్వర్ణం 4 d ago

జోర్డాన్ లోని అమ్మాన్ లో జరుగుతున్న ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షీప్ లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది. శుక్రవారం రాత్రి జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో మనీషా అద్భుత ప్రదర్శన చేసింది. మహిళా రెజ్లర్ మనీషా 62 కేజీల కేటగిరీలో చాంపియన్ గా నిలిచింది. ఉత్తర కొరియాకు చెందిన ఒకే జె.కిమన్ను 8-7 తేడాతో మట్టికరిపించి బంగారు పతకం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 7కు చేరింది.